Saturday, August 2, 2025

వామపక్షం..ప్రజలపక్షం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వాల తప్పులను
ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను
మించిన వాళ్లు లేరు ప్రజావ్యతిరేక
విధానాలను ఎండగట్టడంలో
వారెప్పుడూముందుంటారు
అధికారంలో ఉన్న వారిని గద్దె
దింపడంలోనూ కమ్యూనిస్టులు
సమర్థులు కమ్యూనిస్టులు
ఉప్పులాంటి వారు 2004లోనూ
కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర
మరువలేనిది : సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వాల తప్పులను ఎ త్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని, అ లాగే ప్రజల పక్షాన పోరాడటంలో కమ్యూనిస్టులు ముం దుంటారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు ఉప్పులాంటి వారని, ఉప్పులేని ఏ కూర కూడా రుచించదని, అలాగే కమ్యూనిస్టులు లేని సమాజం కూడా అలానే ఉంటుందని తెలిపారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి పనికొస్తారో లేదో తెలియదు కానీ, ఉన్నోడిని దించేందుకు మాత్రం పనికొస్తారని చమత్కరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలన్నా, అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని అన్నారు. తనకు మొదటి నుంచి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరువలేనిదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ దినపత్రిక 10 వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొ న్ని మాత్రమే ఉంటాయన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉ పయోగ పడ్డాయని ముఖ్యమంత్రి తెలిపారు. నాటి సా యుధ రైతాంగ పోరాటంలో సామాజిక రుగ్మతలపై ప్రజ ల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యం లో నిర్వహించిన పత్రికలు సైతం ఉపయోగపడ్డాయని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ పాలకులు ఎవరైనా ప్రజ ల పక్షం నిలుస్తున్న పత్రికలు కొన్ని ఉన్నాయని అన్నారు.

జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్
నిర్వచించాల్సిన పరిస్థితులు
ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవని, కానీ, ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహారిస్తున్నాయని ఆయన తెలిపారు. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్ధం లేకుండా పోతోందని, జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలని సిఎం రేవంత్ సూచించారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్ నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గతంలో తాము ప్రెస్‌మీట్‌లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్లం, కానీ, ఇవాళ వింత పోకడలు వచ్చాయి. ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు తోడయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఓనమాలు రానివాళ్లు సోషల్ మీడియా ముసుగులో
ఓనమాలు రానివాళ్లు సోషల్ మీడియా ముసుగులో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని కనీసం వారిని పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ అసభ్యకరంగా మాట్లాడేవారు జర్నలిస్టు అని చెప్పుకోవడం శోచనీమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News