బెంగళూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియురాలు హత్య చేసింది. దీంతో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కొప్పళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామనూరుకు చెందిన నేత్రావతితో బూదగంప గ్రామానికి చెందిన ద్యావణ్ణ అక్రమం సంబంధ పెట్టుకొని సంవత్సరం క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ద్వావణ్ణకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేత్రావతికి శ్యామణ్ణ అనే ప్రియుడు ఉన్నాడు. వివాహం జరిగిన తరువాత నేత్రావతిని ద్యామణ్ణ పట్టించుకోకపోవడంతో పాటు శ్యామణత్ణో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది.
భర్తను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. బూదగుంప గ్రామ శివారులోకి భర్తను తీసుకెళ్లి తలపై రాడ్‌తో దాడిచేసింది. మృతదేహాన్ని గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంట్లో భర్త కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను ప్రశ్నించారు. ధర్మస్థలికి వెళ్లి భర్త ఇంకా తిరిగి రాలేని సాకులు చెబుతూ గడిపింది. శ్యామణ్ణతో కలిసి నేత్రావతి నాగపంచమి వేడుకల చేయడంతో ఆమెపై ప్రవర్తనపై ద్యామణ్ణ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నేత్రావతిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ప్రియుడితో పాటు భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.