సూర్యాపేట: యువతి, యువకుడు ఐదేళ్ల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేయసి సదరు యువకుడిని దూరం పెట్టడంతో మనస్థాపంలో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో మోతె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడబండ్లగూడెం గ్రామానికి చెందిన ఏపూరి ప్రవీణ్ అనే యువకుడు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు గత ఐదేళ్ల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇటీవల ప్రవీణ్ ఫోన్ నంబర్‌ను ఆమె బ్లాక్ చేయడంతో మరో యువకుడితో ఫోన్లో మాట్లాడుతుందని అతడు తెలుసుకున్నాడు. భగ్న ప్రేమికుడు తన ప్రియురాలు మోసం చేసిందని మానసికంగా కుంగిపోయాడు. బోడబండ్లగూడెంలోని తన ఇంట్లో గడ్డి మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని సూర్యాపేటలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడిచికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ నంబర్ బ్లాక్… భగ్న ప్రేమికుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -