Sunday, August 3, 2025

దృఢ సంకల్పానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధే నిదర్శనం: మోడీ

- Advertisement -
- Advertisement -

వారణాసి: ఉగ్రదాడిలో మహిళలు తమ సిందూరం కోల్పోయారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తెలిపారు. ఆపరేషన్ సిందూరం ద్వారా పహల్గాం దాడికి ప్రతికారం తీర్చుకున్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని సిందూరం కోల్పోయిన మహిళలకు అంకితమిస్తున్నానని అన్నారు. వారణాసిలో పర్యటించిన మోడీ రూ. 2200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 20వ విడత రూ.20 వేల కోట్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పిఎం మోడీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ లబ్ధి చేకూరిందన్నారు.  మహదేవ్ ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు.

అసత్యాలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ నేతలు పక్కదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ పథకాలతో రైతులకు అత్యంత ప్రయోజనం చేకూరుస్తున్నామని, రైతుల కోసం రూ. 21 వేల కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. రైతులను ఆదుకునేలా (support farmers) ఎన్డీయే ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. తాము రైతులకు ఏ హామీలైతే ఇచ్చామో.. అంతకంటే ఎక్కువే ఇస్తున్నామని మోడీ పేర్కొన్నారు.

ప్రభుత్వ దృఢ సంకల్పానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధే నిదర్శనం అని ప్రశంసించారు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ నేతలు చేసే అసత్య ప్రచారాలు నమ్మెుద్దు అని సూచించారు. ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వేలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఆపకుండా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 3.75 లక్షల కోట్లు జమ చేశామన్నారు. ఒక్క కాశీలోని రైతుల ఖాతాల్లో రూ. 900 కోట్లు నిధులు విడుదల చేశామని మోడీ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News