హైదరాబాద్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. కృష్ణా నదిపై బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన (Foundation development works) చేశారు.
ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల పూర్తి అయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చు అని తెలియజేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఎపి మంత్రులు మాట్లాడకూడదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాబట్టే బనకచర్ల ప్రాజెక్టు ఆగిందని చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేసింది బిఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.