Sunday, August 3, 2025

గిల్ ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

ఐదో చివరి టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా తర్వాత పుంజుకుంది. మూడో రోజు ఆకాశ్ దీప్ తో కలిసి ఆట ప్రారంభించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ఆకాశ్.. చక్కని షాట్లతో అలరించాడు. బౌండరీలతో చెలరేగిన ఆకాశ్ తొలి టెస్టు అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్(11) మరోసారి నిరాశపర్చాడు. లంచ్ బ్రేక్ తర్వాత అట్కిన్సన్ బౌలింగ్ పెవిలియన్ కు చేరాడు. 189 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే.. కీలక సమయంలో గిల్ ఔట్ కావడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో కరణ్ నాయర్(01), జైస్వాల్ (86) క్రీజులో ఉన్నారు. ఇక, టీమిండియా 174 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News