మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ యా త్ర ల్లో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తి చే శారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అధికారంలో వచ్చిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి పోయిన రే వంత్ రెడ్డితో రాష్ట్రానికి పైసా ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఢిల్లీ బాసుల కాళ్ల ద గ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పె ట్టారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఫై ల్స్‌తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో రా ష్ట్రా న్ని పాలిస్తున్న రేవంత్ రెడ్డి టూరిస్ట్ సిఎం గా దేశ చరిత్రలో మిగిలిపోతారని చె ప్పా రు. ఫ్లైట్ టికెట్‌లు బుక్ చేసుకోవడం, ఢిల్లీ కి అప్ అండ్ డౌన్ చేయడం, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూ రావ డం అనే మూడు పనులను సిఎం అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పట్టుదల తో చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పాలించే ముఖ్యమంత్రి కావాలి కానీ, ఢిల్లీకి విహార యాత్ర లు చేసే టూరిస్ట్ సిఎం అవసరం లే దరి అ న్నారు. ముగ్గురు యజమానుల ముద్దుల బానిస అయిన రేవంత్ రెడ్డి తన మొదటి బాస్ రాహుల్ గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రెండో యజమాని మోడీ కి సన్నిహితులైన వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, ఇక మన అన్నదాతల కడుపు కొట్టి తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచి పెడుతున్నారన్నారని పేర్కొన్నారు. తెలంగాణ సోయి లేని రేవంత్ రెడ్డి బానిస మనస్తత్వంతో త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణ నిలువు దోపిడికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలి
ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి సాధించింది ఏమిటో దమ్ముంటే రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. 50 సార్లు ఢిల్లీ బాసుల గుమ్మం తొక్కిన రేవంత్ రెడ్డి, ఒక్క కొత్త ప్రాజెక్టుకు అనుమతులు కానీ, అదనంగా కేంద్రం నుంచి నిధులు తేవడం లేదంటే రాష్ట్రం కోసం ఓ ప్యాకేజీ అయినా సాధించారా..? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే బనకచర్లతో మన వ్యవసాయ రంగం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని యావత్ తెలంగాణ తల్లిడిల్లుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం గురువు చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే సిఎంకు సోయి లేదని మండిపడ్డారు.
పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర లేక, పొలాల్లో చల్లడానికి యూరియా దొరక్క అన్నదాతలు అరిగోస పడుతుంటే రేవంత్ మాత్రం ఫోటో షూట్లు, వీడియోలు, విందు రాజకీయాలతో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదని, జాబ్ క్యాలెండర్ల జాడ లేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రాలేదు.. తులం బంగారం ఊసు లేదు.. రూ.4 వేల ఫించన్ జాడ లేదు.. గురుకులాల గోడు పట్టదు… గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు ఆగడం లేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నారు… దిగుతున్నారని విమర్శించారు. 50 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిన రేవంత్ రెడ్డి, తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదని, శుష్కప్రియాలు..శూన్య హస్తాలే అని కెటిఆర్ పేర్కొన్నారు.