Sunday, August 3, 2025

రాజకీయ జోక్యం లేని క్రీడావిధానం

- Advertisement -
- Advertisement -

చదువుల్లోనే కాదు.. క్రీడలలోనూ
రాణించాలి మైదానాలన్నీ పెళ్లిళ్లకు,
ఫంక్షన్లకు కేంద్రాలుగా మారాయి.. దీనిని
మార్చడం కోసమే కొత్త విధానం
క్రీడా విధానం లేకపోవడం వల్లనే
యువత డ్రగ్స్ వైపు వెళ్తున్నారు
నూతన క్రీడావిధానం ఆవిష్కరణలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: క్రీడలను ప్రోత్సహించడ మే మా ప్రభుత్వ విధానమని, క్రీడా విధానంలో రాజకీ య జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్ధేశ్యంతోనే రాష్ట్రంలో క్రీడా పాలసీని 2025ను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త మ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ -2047లో స్పో ర్ట్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టుకున్నామని సిఎం రేవంత్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరిగిన ‘ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్ కాంక్లేవ్’లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(క్రీడలు) ఎపి జితేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ స్పోర్ట్ పాలసీ -2025’ను సిఎం విడుదల చేశారు. దీంతోపాటు పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఎం ఓయూలను కుదుర్చుకుంది. సిఎం సమక్షంలో ప్రముఖ క్రీడాకారులు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, పలు స్పోర్ట్ అకాడమీలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వివిధ క్రీడల్లో రాణించిన నలుగురు క్రీడాకారులకు సిఎం రేవంత్ నగదు బహుమతిని అందజేశారు.

క్రీడల్లో అనుభవం ఉన్న వారితో బోర్డు
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్ధేశ్యంతోనే స్పోర్ట్ పాలసీని తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. యువత చదువులోనే కాకుండా, క్రీడల్లోనూ రాణించాలన్నారు. పిపిపి పద్ధతిలో తెలంగాణ నూతన క్రీడా విధానం తీసుకువచ్చామని కార్పొరేట్ రం గంలో సక్సెస్ రేటు ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారిని, స్పోర్ట్ యూనివర్సిటీ, వ్యవస్థలను నిర్వహించిన అనుభవం కలిగిన వారిని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. తెలంగాణలో స్పోర్ట్ యూనివర్సిటీ, స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపవడం వల్లే యువత వ్యసనాలకు బానిస అవుతున్నారని సిఎం చెప్పారు. ప్ర భుత్వాలు క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే మాదక ద్రవ్యాలు మనవైపు దూసుకు వస్తున్నాయని సిఎం రేవం త్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కేసులు బాగా పెరిగిపోయాయని, డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్ ఫోర్స్‌ను ఏర్పా టు చేశామని సిఎం రేవంత్ తెలిపారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్ల యువత డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన గ డ్డ అని, తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పో రాడారని, అలాంటి యువత ఇప్పుడు వ్యసనాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

క్రీడామైదానాలు ఫంక్షన్ హాళ్లుగా
పోరాట స్పూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతం క్రీడల్లో రాణించాలని, ప్రపంచంతోనే పోటీ పడి దేశానికి గొప్ప పేరు తీ సుకురావాలన్న ఉద్ధేశ్యంతోనే నూతన క్రీడా పాలసీని తీ సుకువచ్చామన్నారు. క్రీడామైదానాలు పెళ్లిళ్లు చేసుకునే ఫంక్షన్ హాళ్లుగా లేదా సన్ బర్న్ ఈవెంట్ చేసుకునే వేదికగా మారాయన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్ యూనివర్సిటీ, స్పో ర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలనుకున్నట్లు సిఎం చెప్పా రు. ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచే ఉన్నారని సిఎం చెప్పారు. అజారుద్దీన్, రవితాం, వివిఎస్ లక్ష్మణ్, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తీ మనవాళ్లేనని ఆయన తెలిపారు. 1956 లో జరిగిన ఒలింపిక్స్ లో నా లుగో స్థానం సాధించిన పుట్‌బాల్ జట్టు లో హైదరాబాద్ కు చెందిన వారు 9 మంది ఉన్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. సిరాజ్, నిక్కత్ జరీన్‌లకు గ్రూప్ వన్ ఉద్యోగం తో పాటు హైదరాబాద్ లో ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఫారా ఒలింపిక్స్‌లో రాణించిన దీప్తికి రూ. కోటి నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం ఇచ్చామని తెలిపారు. చదువులోనే కాదు క్రీ డల్లో రాణించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్న సందేశా న్ని సమాజానికి అందించామని సిఎం పేర్కొన్నారు.

ఒలింపిక్స్ పతకాల్లో ఇండియా స్థానం 71
ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించడం వల్లే మొన్న జరిగిన ఒ లింపిక్స్‌లో మనం పతకాలు సాధించలేదని అందుకే రా ష్ట్రంలో తాను నూతన క్రీడాపాలసీని తీసుకురావాలని ని ర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. 140 కోట్ల జనా భా ఉన్న ఈ దేశం ఒక్క గోల్డ్ మెడల్‌ను తెచ్చుకోకపోవ డం నిజంగా మన దేశానికి, మన జాతికి అవమానంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారత దేశం ఒలిపింక్స్ పతకాల్లో 71వ స్థానంలో ఉండటం మనం అందరం ఆలోచించాల్సిన విషయమన్నారు. 2026లో ఖేలో ఇండియాను తెలంగాణను నిర్వహించాలని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయాకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని తెలిపారు.

విజన్ డాక్యుమెంట్ 2047లో
స్పోర్ట్ పాలసీకి ఒక ఛాప్టర్ కేటాయించాం
దక్షిణ కొరియాలో ఒక్క స్పోర్ట్ యూనివర్సిటీకి 16 బం గారు పతకాలు వచ్చాయని, ఒక్క అమ్మాయికి 3 పతకా లు గెలుచుకుందని ఆయన తెలిపారు. క్రీడలకు తెలంగాణను వేదిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సిఎంతెలిపారు. విజన్ డాక్యుమెంట్ 2047 లో స్పోర్ట్ పాలసీకి ఒక ఛాప్టర్ కేటాయించామని ఆయన పేర్కొన్నారు. నేషనల్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్ మిలటరీ గేమ్స్ ను నిర్వహించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉందన్నారు. వ చ్చే ఒలింపిక్స్ ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి తా ము సిద్ధమని ప్రకటించామని, కానీ, అందులో ఒక్క పత కం కూడా రాకపోతే మన మొహం ఎక్కడ పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఒలంపిక్స్‌లో రెండు విభాగా ల నిర్వహణకు సిద్ధమని కేంద్రానికి తెలిపామని, తెలంగాణ క్రీడా విధానం కేవలం ఒక కాగితం కాదని ఆయన తెలిపారు. బంగారు రేకులతో రాసిన పత్రాన్ని ఒలింపిక్స్ లో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన క్రీ డాకారులకు పిలుపునిచ్చారు. స్పోర్ట్ పాలసీతో రాష్ట్రం లో కొత్త అధ్యాయం మొదలుకావాలని, క్రీడలకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News