- Advertisement -
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చంపేట మండల పరిధిలోని అంకెరునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. కల్పన ఆకారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాత్లావత్ ముక్తాల డిఎస్ఆర్యాప్లో తప్పుడు హాజరు నమోదు చేయడంతో ఇరువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు ఎవరున్నా సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు.
- Advertisement -