Sunday, August 3, 2025

కార్పొరేట్‌కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా: ఉత్తమ్ పద్మావతిరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కోదాడటౌన్: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పది లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్షంతో 26 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 3 కోట్ల 66 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన సిటి స్కాన్ యంత్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ముగ్గురు స్టాప్ నర్సులతో కలిసి జాతీయ రాబిస్ కంట్రోల్ ప్రోగ్రాం ఏర్పాటుచేయడంతో పాటు పుట్టుకతో బరువు తక్కువ ఉన్న పిల్లలందరికి రిహాబిటేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆసుపత్రిలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, డిసిహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి, వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహా, నాయకులు, కేఎల్‌ఎన్ ప్రసాద్, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, కమదన చందర్‌రావు, మధు, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మం, బాగ్థాద్, బాజాన్, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News