Monday, August 4, 2025

నేడు మోస్రా మండల కేంద్రానికి మంత్రి సీతక్క రాక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోస్రా ః నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి ఆదివారం మోస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం కాబడిన సమయకృత మండల కార్యాలయంతో పాటు జనరల్ ఫంక్షన్‌హాల్‌ను తెలంగాణ శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్గీయులు తెలియజేశారు. మంత్రి సీతక్క రాకతో మండల పరిధిలోని రాజకీయ నాయకులతో పాటు మండలాధికారులు హడావిడిగా పనులలో నిమగ్నమయ్యారు. శనివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాటు మోస్రా తహసీల్దార్ రాజశేఖర్, ఎంపిడివో కె. శ్రీనివాస్, పనులను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News