- Advertisement -
మన తెలంగాణ/బంట్వారం : మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు తీరేనా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా తాగునీరు సరిగ్గా రావడంలేదని అధికారులకు విన్నవించినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదని, వర్షాకాలంలోనే ఇలా ఉంటే ఇక వేసవికాలం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో రోజూ గ్రామంలోని బోరుబావుల వద్ద ప్రజలు బారులుతీరుతున్నారని అన్నారు. ప్రజలు త్రాగునీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీరు అందించాలని కోరుతున్నారు.
- Advertisement -