మనతెలంగాణ/పరిగి: గత ఆరునెలలుగా ఉండటానికి సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబ సభ్యులను ఆధుకునేందుకు కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని తహాశీల్‌దార్ కార్యాయలం పనులను పర్యావేక్షణ చేశారు. ఇందులో భాగంగా ఎంపిడిఓ కార్యాలయ సముదాయంలో తహాశీల్‌దార్ కార్యాలయం మరమ్మతులు చేస్తున్న భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పేద కుటుంబ సభ్యులు క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కుటుంబంలో కుటుంబ యాజమాని నారాయణ ఇతని కుమారుడు వెంకటేష్, కోడలు పద్మమ్మ, తల్లిదండ్రులను కోల్పోయి తాత వద్ద ఉంటున్నారు. మనవడు నర్సిములు గత ఆరు నెలలుగా సొంత ఇల్లు లేకపోవడంలో ఎక్కడో ఒక చోటా షెల్టర్ చూసుకొని జీవణం సాగిస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామి ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు పొందే విధంగా అధికారులు సహాకరించాలని తహాశీల్‌దార్‌కు సూచించారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న నర్సిములు అనే బాలుడికి వైద్యం నిమిత్తం వైద్యాధికారికి సూచించారు. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 వేల నగదు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీవో వాసుచంద్ర, డిఎంహెచ్‌ఓ లలితాదేవి, డిడబ్లూ ఓ కృష్ణవేణి, తహాశీల్‌దార్ వెంకటేశ్వరీ, కమీషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.