న్యూయార్క్: అమెరికాలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు స్వస్థలం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లుట్ల గ్రామంలో ఉప్పలయ్య-శోభ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుర్రెముల సాయికుమార్‘(31) అనే కుమారుడు ఉన్నాడు. పది సంవత్సరాల క్రితం అతడు అమెరికాకు వెళ్లాడు. ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. సాయి కుమార్ బాలుడిగా నటిస్తూ ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన శృంగారం చేయడానికి ఒప్పుకోని 19 మంది బాలికల అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసినట్టు నేరం రుజువు కావడంతో 2025 మార్చి 27న అమెరికాలోని కోర్టు సాయికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానసికంగా కుంగిపోయి జైలులోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లి అంత్యక్రియలు జరిపించారు.