పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్ గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. (OG) పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ’ఓజీ’ చిత్రం నుంచి మొదటి గీతం ’ఫైర్ స్టార్మ్’ విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ’ఓజీ’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంగీత సంచలనం తమన్ స్వరపరిచిన ‘ఫైర్ స్టార్మ్’ గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఓజాస్ గంభీర పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా తమన్ సంగీతం ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. అదిరిపోయే ఎలక్ట్రానిక్ బీట్స్, భారీతనం మిళితం చేస్తూ సాగిన ఈ గీతం అగ్ని తుఫానుని తలపిస్తోంది. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వానికి నివాళి అన్నట్టుగా ధైర్యంతో నిండిన ఈ పాట(song full courage) సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ నటుడు శింబు ఈ పాటకు తన శక్తివంతమైన గాత్రాన్ని అందించారు. ఉద్వేగం, ఉత్సాహంతో నిండిన ఆయన స్వరం.. ఈ పాటను మరోస్థాయికి తీసుకొనివెళ్ళింది.
‘ఫైర్ స్టార్మ్’ గీతం ఓజీ సినిమా ప్రమోషన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ట్రాక్‌ను అభిమానులు బ్యాంగర్, సంగీత తుఫానుగా అభివర్ణిస్తున్నారు. థియేటర్లలో అభిమానులు ఉత్సాహంతో ఈలలు వేసేలా ఫైర్ స్టార్మ్ గీతం యొక్క సంగీతం, సాహిత్యం ఉన్నాయి. ‘ఫైర్ స్టార్మ్’ గీతం విడుదలతో ‘ఓజీ’ సంగీత ప్రచారం అధికారికంగా ఘనంగా ప్రారంభమైంది. ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.