Monday, August 4, 2025

మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక 71వ జాతీయ అవార్డులలో బేబి (baby) సినిమా రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్‌ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బేబి మూవీ టీమ్ సభ్యులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. నేషనల్ అవార్డ్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు (Responsible good movies) చేస్తామని ఈ సందర్భం గా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్, హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, లిరిక్ రైటర్ సు రేష్ బనిశెట్టి, ఎడిటర్ విప్లవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News