Sunday, August 3, 2025

కాకినాడలో ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుళ్లు హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామర్లకోట ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. సీతారామ కాలనీలో ఇంట్లో తల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, ఇద్దరు కుమార్తెలల తలపై కొట్టి చంపినట్లు దుండగులు గుర్తించారు. మృతులు తల్లి ములపర్తి మాధురి, కుమార్తెలు కుమారి, జెస్సిగా గుర్తించారు. మాధురి భర్త ప్రసాద్ బొలెరో వాహనం డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రాత్రి డ్యూటీకి వెళ్లి వచ్చేసరికి చనిపోయి ఉన్నారని పోలీసులకు ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త చంపాడా? లేక ఎవరైనా చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తే చంపి ఉంటాడని కాలనీ వాసులు ఆరోపణలు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News