Thursday, September 18, 2025

ఏం జరిగిందో…ఏమో.. అమెరికాలో ఆ నలుగురు వృద్ధ ఎన్నారైలు మృతి

- Advertisement -
- Advertisement -

పెన్సిల్వేనియా : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన నలుగురు వృద్ధులు విషాదాంతం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఐదు రోజుల క్రితం ఈ కుటుంబం తమ టయోటా కామ్రీ వాహనంలో బయలుదేరారు. గత నెల 29న బర్గర్ కింగ్ ఔట్‌లెట్‌లో కొద్దిసేపు ఉన్నట్లు తరువాత వారు వాహనంతో పాటు గల్లంతు అయినట్లు తెలిసింది. వీరి కోసం గాలించగా ఆదివారం వీరి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయిన స్థితిలో క్రీక్ రోడ్డు వద్ద కన్పించింది. వీరి భౌతికకాయాలను వెలికితీశారు. ఎక్కువగా సంచారం ఉండని మారుమూల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు అక్కడికి చేరుకునేందుకు నాలుగైదు గంటలు పట్టిందని ది మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది.

మృతులను డాక్టర్ కిశోర్ దివాన్ (89), ఆశా దివాన్(85), శైలేష్ దివాన్ ( 86), గీతా దివాన్ (84)గా గుర్తించారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాద శిష్యులు వెస్ట్ వర్జీనియాలో నిర్మించిన ప్రఖ్యాత ప్రార్థనా మందిరం ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ సందర్శనకు వీరు బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఈ ప్రమాదానికి బలి అయ్యారు. రికార్డుల మేరకు వీరు గత నెల 29న గమ్యస్థానంలో రాత్రి బసచేయాలి. అయితే అక్కడికి చేరుకోలేదని స్పష్టం అయింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై పోలీసు బృందాలు ఆరాతీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News