Monday, August 4, 2025

శిబూసోరెన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ (81) కన్నుమూశారు. ఢిల్లీలో గంగరాం ఆస్పత్రిలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం శిబూ సోరెన్ ఉద్యమం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఏకంగా ఝార్ఖండ్ ముక్తిమోర్చా అనే పార్టీని కూడా స్థాపించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి సేవలందించడంతో 2004 నుంచి 2006 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. సంతాల్ తెగలో జన్మించి ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరిగని పోరాటం చేశారు. శిబూసోరెన్ కుమారుడే ప్రస్తుతం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News