నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి‘.(Gurram Papireddy) ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ థ్రిల్లర్ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “గుర్రం పాపిరెడ్డి‘ సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. యోగిబాబు ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా (Yogi Babu special attraction) నిలుస్తారు”అని అన్నారు. డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “బ్రహ్మానందం పాత్ర ద్వారానే సినిమాలోని పాత్రలన్నీ పరిచయం అవుతాయి. ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, జయకాంత్, అమర్ బురా, డా.సంధ్య గోలీ, కృష్ణ సౌరభ్, అర్జున్ రాజా, ప్రభాస్ శ్రీను, జీవన్ కుమార్, వంశీ పాల్గొన్నారు.