Sunday, August 10, 2025

సిరాజ్‌పై ఓవైసీ ప్రశంసలు.. మియాన్ రిప్లై ఇదే..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) అదరగొట్టాడు. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసి.. సిరీస్‌కే అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆఖరి టెస్ట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సందర్భంగా సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీల నుంచి అభిమానుల వరకూ అందరు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ కూడా సిరాజ్‌ని మెచ్చుకున్నారు.

‘ఆల్వేస్ ఏ విన్నర్.. హైదరాబాదీలా చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా’ అని పోస్ట్ పెట్టారు. దీనికి మియాన్ (Mohammad Siraj) ఆసక్తికర రిప్లై ఇచ్చాడు. ‘‘ధన్యవాదాలు సార్, ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్, నమస్కారం చేసినట్లుగా ఉంటే సింబల్ ఎమోజీలతో తన సందేశాన్ని తెలియజేశాడు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఓవల్ టెస్ట్‌లో 9 వికెట్లు తీసిన సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి 674 రేటింగ్‌తో 15వ స్థానంలో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News