- Advertisement -
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బిల్లలవలస దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. రెండు లారీలు నుజ్జునుజ్జుగా మారాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు లారీ డ్రైవర్లుగా గుర్తించారు. క్రేన్ సహాయంలో వాహనాలను పక్కకు తొలగించారు.
- Advertisement -