Saturday, August 9, 2025

దాయాదుల పోరుకు ఇబ్బంది ఉండదు..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సుభాన్ అహ్మద్ ఖాన్ హామీ ఇచ్చారు. భారత్, పాక్ మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. ఆసియా కప్‌కు, లెజెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి పోలీకే లేదన్నారు. ఆసియాకప్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆసియాకప్‌ను అత్యంత పగడ్బంధీ వ్యూహంతో నిర్వహిస్తామన్నారు. దాయాదుల మ్యాచ్ కోసం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ఎలాంటి లోటు లేకుండా టోర్నీని నిర్వహించి తామెంటో నిరూపిస్తామని సుభాన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News