Sunday, August 10, 2025

ఒక్క మీటింగ్ కు రాకపోతే చిత్తశుద్ధి లేనట్లా?: మహేష్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇది ఇన్ చార్జ్ పాదయాత్ర కాదని, పిసిసి చీఫ్ పాతయాత్ర అని టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. కాంగ్రెస్ పాదయాత్రలో సిఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటానని చెప్పారని అన్నారు.  కాంగ్రెస్ పాదయాత్రపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సు యాత్ర చేద్దామనుకున్నానని చివరికి పాదయాత్ర అయ్యిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ అంత్యక్రియల్లో ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ ధర్నాకు రాలేదని తెలియజేశారు. ఒక్క మీటింగ్ కు రాకపోతే చిత్తశుద్ధి లేనట్లా? అని ప్రశ్నించారు. బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాంచదర్ రావుకు బిసిల పట్ల అవగాహన (Awareness BCs) లేదని విమర్శించారు. ఎప్పటికెనా తెలంగాణకు బిసి వ్యక్తే సిఎం అవుతారని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని తన తపన అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News