- Advertisement -
పండగల వేళ ప్రయాణికులకు రైల్వే ఆఫర్ ప్రకటించింది. ‘రౌండ్ ట్రిప్’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రయాణ ఖర్చులో ప్రయాణికులకు కొంత మేరకు తగ్గించాలని నిర్ణయించింది. అయితే రిటర్న్ జర్నీ చేసినప్పుడే ప్రయాణికులకు అది వర్తిస్తుంది. రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే 20శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీని ద్వారా పండగల సమయంలో ముందస్తు టికెట్‌ను బుకింగ్‌ను ప్రోత్సహించినట్లు అవుతుంది. తద్వారా రైల్వేపై ఒత్తిడి కూడా తగ్గనుంది. ఆగస్టు 14 నుంచి బుకింగ్‌లు ప్రారంభిస్తున్నట్లు, అక్టోబర్ 13 నుంచి 26 నడుమ జరిపే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని రైల్వే వెల్లడించింది. దీనిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
- Advertisement -