స్థానిక ఆర్‌జి కర్‌లో హత్యాచార బాధితురాలి తల్లిపై స్థానిక పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. తనను పోలీసులు అకారణగా గొడ్డును బాదినట్లు బాదారని , తన గాజులు పగిలాయని, తలకు గాయం అయిందని ఆమె ఇక్కడ ఆరోపించారు. బాధితురాలిపై అమానుషకాండ జరిగి ఏడాది అవుతున్నందున ఇక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లుతుండగా పోలీసులు సెక్రెటెరియట్ చలో దశలో తనపై దౌర్జన్యానికి దిగారని ఆమె మీడియాకు తెలిపారు. తన కూతురు బలి అయింది. ఆమెకు న్యాయం జరగాలని రాష్ట్ర సచివాలయంలో పెద్దలకు విజ్ఞప్తి చేద్దామని అనుకుంటే తనకు
ఈ విదంగా దెబ్బలతో న్యాయం చేశారని ఆమె వాపోయారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో మమత ప్రభుత్వం విఫలం అయింది. వెంటనే ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాజీనామా చేయాలని ధర్నాకు దిగిన జనం డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన తమను డోరినా చౌరస్తాలో పోలీసులు అడ్డుకుని, దాడికి దిగారని బాధితురాలి తండ్రి కూడా విమర్శించారు. సెక్రెటెరియట్‌కు నిరసన ప్రదర్శన మార్గమధ్యంలో పోలీసుల లాఠీచార్జీలు, ఆందోళనకారుల ప్రతిఘటనలతో ఉద్రిక్తం అయింది. బిజెపి నాయకులు సువేందు అధికారి ఇతరులు ఇక్కడి పోలీసు జులుంకు వ్యతిరేకంగా పార్క్ స్ట్రీట్ జె ఎల్ నెహ్రూరోడ్‌లో భైఠాయించారు.