Sunday, August 10, 2025

‘అందరి సరదాలు తీరిపోతాయి’.. బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss). మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకూ ఈ షోకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. త్వరలో బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు కామన్‌మ్యాన్‌కి కూడా ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సీజన్ ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కనిపించి ప్రోమోలో నవ్వులు పూయించారు. బిగ్‌బాస్ (Bigg Boss) హౌస్‌కి వెళ్లేందుకు కిషోర్ సిద్ధమవగా.. కింగ్ నాగార్జున వచ్చిన ఆయనకు కొన్ని కండీషన్స్ చెబుతారు. దీంతో కిషోర్ షాక్ అవుతారు. చివర్లో ‘ఈసారి బిగ్‌బాస్‌నే మార్చేస్తున్నాం. అందరి సరదాలు తీరిపోతాయి. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే’ అని నాగార్జున పేర్కొంటారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌కి ఎంపిక అయిన సెలబ్రిటీలు వీళ్లే అంటూ సోషల్‌మీడియాలో పలు లిస్ట్‌లు ప్రచారం అవుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే.. సీజన్ ప్రారంభం అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News