Monday, August 11, 2025

తృటిలో ప్రాణాలతో బయటపడ్డాం: కేసి వేణుగోపాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. దీంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆదివారం సాయంత్రం సాంకేతిక సమస్య కారణంతోపాటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా చెన్నైకి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ విమానంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కె.సి. వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు ప్రయాణించారు. ఈ ఘటనపై కేసి వేణుగోపాల్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “అదృష్టం కొద్దీ మేం బతికిపోయాం. పైలట్‌ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. నాతోపాటు పలువురు ఎంపిలు, చాలా మంది ప్రయాణికులు.. భయంకర విషాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News