Monday, August 11, 2025

తెలంగాణ అస్తిత్వం – సృజన రంగం

- Advertisement -
- Advertisement -

తెలంగాణా అస్తిత్వ పోరాటం ఈ నాటిది కాదు. ముక్కోటి గొంతుకలు, సబ్బండ వర్ణాలన్నీ ఒక్కటై సాధించుకున్న తెలంగాణా స్వరాష్ట్రం కోసం జరిగిన మహత్తర పోరాటం చరిత్రలో వందలాది అమరుల త్యాగాలతో లిఖంచబడ్డది. రాష్ట్ర సాధనతోనే తెలంగాణా అస్తిత్వ పోరాటం అంతం కాదు, కాకూడదు. భౌగోళికంగా సరిహద్దుల సాధనానంతరం కూడా నిరంతరం తనదైన అస్తిత్వ్వాన్ని పరిరక్షించుకుంటూ, సకల రంగాలలో స్థిరీకరీంచుకుంటూ, ప్రత్యామ్నాయ వేదికలను నిర్మించుకుంటూ, సృజనాత్మక రంగాలలో నిర్మాణాత్మక, నిర్దిష్ట విధి విధానాలను తెలంగాణా సమాజం రూపొందించుకోవాలి. ఇప్పటికే సృజన రంగంలో ఆ పని కొంత ప్రారంభమైనా, మరెంతో పని జరగవలసే వుంది. ఈ విషయంలో సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. మొదటగా ప్రసిద్ధ రచయిత, కవి నందిని సిధారెడ్డి గారి అభిప్రాయాలతో కొత్తగా ప్రారంభించిన ‘తెలంగాణం’ శీర్షిక కింద వరుసగా వస్తాయి.
మెహఫిల్ టీం

తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?
భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, ప్రత్యేకతలు కలిగి ఉండడమే అస్తిత్వం. తెలంగాణ అనేక కోణాల్లో ప్రత్యేక గుర్తింపులు (Unique identities) కలిగి ఉన్నది. తెలంగాణ అస్తి త్వం అంటే, తనదైన ప్రత్యేక చరిత్ర, ప్రత్యేక ఉత్పత్తి విధానం, విశేష సాంస్కృతిక జీవనం. స్వభావంలో ఆచరణలో, అనుభవంలో, స్థానిక ముద్ర కలిగి ఉండడమే తెలంగాణ అస్తిత్వం. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్థిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?

తెలంగాణ సాహిత్య, సంస్కృతిక, కళారంగాలు ఇక్కడి ప్రజా జీవితంతో ముడివడిఉన్నాయి. ఈ రంగాల ఆవిర్భావ వికాసాలు, వివిధ ప్రభావాలు చారిత్రక, సామాజిక, పరిస్థితుల నుండి రూపొందినవి. చాలాచోట్ల కనిపించని సామూహికత, సమైక్యత తెలంగాణా ను కళా సాంస్కృతిక రంగాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆధ్యాత్మిక రంగం నుంచి ఉద్యమ రంగం దాకా, ప్రజల భాగస్వా మ్యం ప్రజల దృష్టి కోణం స్పష్టంగా గోచరిస్తాయి. అయితే ఉమ్మడి రాష్ట్రం లో ఈ ప్రత్యేక లక్షణాలు గుర్తింపునకు నోచుకోలేదు. పైగా, అణచివేతకు గురయ్యాయి. కొన్ని సందర్భాల్లో వివక్ష అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలు ప్రజా జీవన ప్రతిబింబాలు. ప్రజా చైతన్య ప్రేరకాలు. అవి నిరంతరం పరిరక్షించబడాలి. వికసించటానికి, విస్తరించటానికి, అనువైన కళా వా తావరణం కల్పించాలి.

పాలకులైనా, ప్రజలైనా, కళాకారులైన తెలంగాణ సృహతో, తెలంగాణ సోయితో వ్యవహరించాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలం గాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయని అనుకుంటున్నారు? దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. సృజన రంగానికి కొంత మేలు జరిగినప్పటికీ, ఇవ్వవలసిన ప్రాధాన్యత దక్కలేదు. తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ సమన్వయంతో అస్తిత్వ పరిరక్షణ వైపు అడుగులేసింది. రాష్ట్రం ఏర్పడిన ఉత్సాహంలో కొంతవరకు కొన్ని సమూహాల్లోకి విస్తరణ జరిగింది. అది ఎంత మాత్రమూ సరిపోదు.

చాలా జరగవలసి ఉంది. ఏడాది రెండేళ్లలో జరిగే పని కాదు. నిరంతరంగా అస్తిత్వ పరిరక్షణ జరగాలి. ఎప్పుడో ఒకసారి ప్రపంచ స్థాయి సభలు జరిపితే సరిపోదు. అభివృద్ధి విషయంలో ఎంత శ్రద్ధ అవసరమో, సాంస్కృతిక పరిరక్షణకూ అంత శ్రద్ధ అవసరం.మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవంతంగా, వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణా స్వీ య అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మం చిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం

అవసరమనుకుంటున్నారా?
నిజమే.. ప్రపంచీకరణ సృజన రంగంలో వేగవంతమైన మార్పులు తెచ్చింది. అట్లాగే, మౌలిక స్వభావాన్ని పెకలించే ప్రయత్నం కూడా చేస్తున్నది. ఈ మార్పులు ప్రజల్ని మరింత ఇబ్బందిలో పడేస్తున్నవి. ప్రజా సంస్కృతుల్ని, తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. బలవంతంగా మార్కెట్ సంస్కృతిని రుద్ది, పెంచి పోషిస్తున్నాయి ప్రభుత్వాలు. స్వీయ అస్తిత్వ, ఇతర సంస్కృతులు, ప్రాం తానికి, ప్రజలకు మంచి చేసే దిశలో ఎంత మాత్రం లేవు. సృజన రంగంలో పరిణామాలు కూడా జీవనానుభావాలను మెరుగుపరిచేవిగా లేవు.

మంచిని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, సమ్మిళితం చేసుకోవడానికి, తెలంగాణ చరిత్ర పొడుగు నా సానుకూలంగానే ఉన్నది. మంచికంటే మాయను ముందు కు, తెస్తే ఆలింగనంలో ఆధిపత్యం దాచుకొని వస్తే, కృత్రిమ మేధ ముసుగులో, జ్ఞాన కేంద్రాల ముసుగులో, సహజ వనరుల్ని, స్థానిక సౌందర్యా న్ని, నైపుణ్యాన్ని తొక్కడానికి వస్తే తెలంగాణ సహించదు. తెలంగాణ కు తెలంగాణే రక్ష. అస్తి త్వ పరిరక్షణ ఆత్మరక్ష. తెలంగాణ సృజన రంగానికి తెలంగాణే బలం. ప్రపంచీకరణను నిలువరించగలిగేది స్థానికతే. ఎం త సాంకేతికత సాధించినా, స్థానికతే జాతి అస్తిత్వం.

తెలంగాణా అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
తెలంగాణ అస్తిత్వం ప్రధానంగా సాంస్కృతిక కళా రంగాల వికాసం ద్వారానే పరిరక్షించబడుతుంది. అందు లో భాషది ప్రథమ స్థానం. భాషలోని లక్షలాది పదాలు క్రమంగా అంతరిస్తున్నాయి. నిఘంటువుల నిర్మాణం తప్పనిసరి. మార్కెట్ రంగంలో కూడా తెలంగాణ భాష విశేషంగా రాణిస్తున్నది. భాషా, విశేషాల్లో లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు పరిశోధన అవసరమైన పనిగా భావించి సంపూర్ణంగా పూనుకోవాలి. తెలంగాణ చరిత్ర మట్టి కుప్పల్లో, గ్రంథ భాండాగారాల్లో అవస్థ పడుతున్నది. తవ్వి వెలికి తీయాలి. చరిత్ర నిర్మాణం జరగాలి. జానపద సాహిత్యం తెలంగాణ పల్లెల్లో పుష్కలంగా ఉన్నది. ‘జానపద అకాడమీ’ ఏర్పాటయింది కానీ, ఏ నిర్మాణం లేదు.

ఆయా సంస్థలను పనిలోకి తేవాలి. సాహిత్య, చిత్ర, శిల్ప, నృత్య కళల్లో వ్యక్తిగత కృషి నుంచి, నిర్మాణాత్మకమైన కృషి ఆయా కళా విభాగాల ద్వారా జరిపించాలి. తెలంగాణ సంగీతానికి పెన్నిధి. గాయకుల సంఖ్య అగణితం. సంగీత అకాడమీ అవసరం. తెలంగాణ సినిమా ఉన్నది. సినిమా అకాడమీ అవసరం. తరచుగా సదస్సులు నిర్వహించటం అవసరం. కొత్త తరా న్ని తయారుచేయడానికి శిక్షణలు అవసరం. ఒక సాంస్కృతిక విధానం రూపొందించుకొని తెలంగాణ ఆదర్శంగా నిలవాలి.

  • తెలంగాణ అస్తిత్వ సంస్కృతి పరిరక్ష
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News