హైదరాబాద్: టాలీవుడ్ లో గత వారం రోజులుగా సినీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సోమవారం నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ కు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి నుంచి తెలుగు చిత్రి పరిశ్రమలో అన్ని సినిమాల షూటింగ్ బంద్ కానున్నాయి. ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని శుక్రవారమే నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు నుంచి ఎక్కడిక్కక్కడ సినిమా షూటింగ్స్ నిలిచిపోనున్నాయి.
కాగా, తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో సినీ కార్మికులు సమ్మోకు దిగారు. కృష్ణానగర్‌లో వారం రోజులుగా వారు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరిపింది. అయితే, కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ అంటోందని.. అది తప్పు అని ఫిల్మ్ పెడరేషన్ తెలిపింది. ఇకపై ఏ షూటింగ్స్ జరగవని పేర్కొంది. మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదని.. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేస్తారా అని, వచ్చే ఆదాయంలో తాము వాటాలు అడగట్లేదని ఫెడరేషన్ నాయకులు మండిపడ్డారు..