యుక్రేనియన్ రచయిత ఆంద్రే కుర్కోవ్ రాసిన నాలుగు నవలలలో, బోరిస్ ద్రాల్యూక్ ఇంగ్లీషులోకి అనువదించిన ‘గ్రే బీస్’ నవల విశేష ప్రాచుర్యం పొందింది. 2014లో రష్యా తూర్పు ఉక్రెయిన్‌ను ఆక్రమించిన సమయంలో, ఇరు పక్షాల మధ్య యు ద్ధం జరుగుతున్న కాలంలో, జాతి విద్వేషం, సరిహద్దు వివాదాలు, సైనిక దౌర్జన్యం నడుమ సామాన్య ప్రజలు అనుభవించిన కష్టాలను కొద్దిపాటి హాస్యం మేళవించి చిత్రీకరించిన నవల ఇది.
డోంబాస్ అనే గ్రామం రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లో, ఏ దేశానికీ సంబంధంలేని ‘గ్రే’ జో న్‌లో ఉంటుంది. రెండు వైపుల నుంచీ ఆ గ్రామ ప్రజలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది తట్టుకోలేక ఆ గ్రామస్థులందరూ తమ ఇళ్ళ నూ, పొలాలనూ ఉన్నపళాన వదిలేసి వలస వెళ్ళిపోతారు. సెర్జీ సెర్గెవిచ్, పాష్కా అనే ఇద్దరు ఊరిని విడిచిపెట్టడం ఇష్టం లేక, అక్కడ ఒంటరి గా మిగిలిపోతారు. ఊళ్ళో ఉన్న రెండు వీధుల్లో ఒక వీధిలో సెర్జీ ఇల్లుంటే, ఇంకో వీధిలో పాష్కా ఇల్లుంటుంది. గ్రామంలో విద్యుత్, టీవీ, ఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. రోజంతా ఫిరంగుల మోతను మించి నిశ్శబ్దం, ఒంటరితనం ఆవరించి ఉంటాయి.
సెర్జీ, పాష్కా ఇద్దరూ ఒకే తరగతిలో చదువుకున్నవారైనా, చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరి కి పడదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి తో ఒకరు (with each other) సహకరించుకోవాల్సిన అనివార్యత ఏ ర్పడుతుంది. సెర్జీ తేనెటీగలు పెంచుతూ ఉంటా డు. మందుగుండు పేలుళ్ళ నుంచి తేనెటీగలను రక్షించి వాటికి ప్రశాంత వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో సెర్జీ వాటిని తీసుకుని ప్రయా ణం మొదలుపెడతాడు. ఈ ప్ర యాణంలో భాగంగా అతనికి అనేక అనుభవాలు ఎదురవుతా యి. తేనెటీగల క్రమబద్ధమైన స హజీవనాన్ని, మనుషుల మధ్య నెలకొన్న వైషమ్యాలను పాఠకులకు గుర్తు చేస్తూ నవల అత్యం త ఆసక్తికరంగా సాగుతుంది.
యుద్ధ వాతావరణం, ఒం టరితనం, ప్రజలు పడే అగచాట్లను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూనే, మరోవైపు అంతర్లీనంగా యుద్ధం, జాతీయత, అస్తిత్వం వంటి మౌలిక ప్రశ్నలను రేకెత్తించే అద్భుత నవ ల ‘గ్రే బీస్’. త్వరలో ఛాయా పబ్లిషర్స్ నుంచీ తెలుగు అనువాద నవలగా వస్తోంది. అనువాదకుడు బోరిస్ ద్రాల్యూక్ యుక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించారు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళ కుటుంబం లాస్ ఏంజెలెస్ నగరంలోని హాలీవుడ్‌లో స్థిరపడింది. పద్నాలుగేళ్ల వయసులో అతను తన మా తృభాషకు దూరమవుతున్నాననే భావనతో, కవి త్వం చదవడం ప్రారంభించి, నచ్చిన కవితలను అనువదించడం మొదలుపెట్టారు. పద్దెనిమిదేళ్ల వయసులో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రపంచ ప్రసిద్ధ అనువాదకుడు మైకే ల్ హెన్రీ హైమ్ (మిలన్ కుందేరా రచనలను ఆంగ్ల పాఠకులకు పరిచయం చేసి, ఎనిమిది భాషల నుంచీ అనువాదం చేసేవారు) వద్ద చేసిన శిష్యరికం, బోరిస్‌పై అనూహ్య ప్రభావం చూపింది.
బోరిస్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచీ స్లావిక్ భాషా సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. తుల్సా యూ నివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో ప్రస్తుతం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన 2016నుంచి 2022 వరకు లాస్ ఏంజెలెస్ రివ్యూ ఆఫ్ బుక్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా, ఎడిటర్ -ఇన్-చీఫ్‌గా సేవలందించారు. 2024లో నిమ్రోడ్ ఇంటర్నేషనల్ జర్నల్ కు ఎడిటర్ -ఇన్ -చీఫ్‌గా నియమితులయ్యారు. ది టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, ది న్యూయార్కర్, ది న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్, లండన్ రివ్యూ ఆఫ్ బుక్స్, పారిస్ రివ్యూ, గ్రాంటా, వరల్డ్ లిటరేచర్ టుడే వంటి అనేక ప్రఖ్యాత పత్రికలలో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.
2022లో బోరిస్, పాల్ డ్రై బుక్స్‌తో కలిసి తన తొలి కవితా సంకలనం, ‘మై హాలీవుడ్ అండ్ అదర్ పోయమ్స్’ను ప్రచురించాడు. ఈ సంకలనం విశేషమైన గుర్తింపును పొందింది. ఐజాక్ బేబుల్, మాక్సిం ఒసిపోవ్, మిఖాయిల్ జొస్చేం ఖో, ఆంద్రే కుర్కోవ్ వంటి ప్రముఖ రష్యన్ రచయితల రచనలను ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. 2022లో ఆండ్రీ కుర్కోవ్ రాసిన ‘గ్రే బీస్’ నవల అనువాదానికి నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ నుంచీ గ్రెగ్ బారియోస్ బుక్ ఇన్ ట్రాన్సి లేషన్ బహుమతిని అందుకున్నారు. 2024లో అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్ నుంచీ సాహిత్య అవార్డును అందుకున్నా రు. కవిత్వం చదవడం, రాయడం ద్వారా మూల రచనలోని శబ్ద సౌందర్యాన్ని కూడా అనువాదంలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని బోరిస్ అభిప్రాయపడతారు.
- పుస్తక రచయిత ఆంద్రే కుర్కోవ్