Monday, August 11, 2025

‘పరదా’ కథ అద్భుతంగా ఉంటుంది: రామ్

- Advertisement -
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ (parada) అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ ‘అద్భుతమైన కథ ఇది. తప్పకుండా ఇలాంటి సినిమాలు ప్రోత్సాహించాలి. బాలీవుడ్‌లో లాపతలేడీస్ లాంటి సినిమాలు చూస్తుంటాం.

మనం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ (movie hit) అయి నిర్మాతలకు చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘సినిమా ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా ఇది’ అని తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ‘నా సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ సినిమాలు. ఇది మాత్రం ఒక బిగ్ స్కేల్ మూవీ. ముగ్గురు పెద్ద స్టార్స్ తో సినిమా చేశాను. ఈ సినిమాకి ఖచ్చితంగా పేరు వస్తుంది. ఈ సినిమాతో అనుపమ కొత్త వర్షన్ చూడబోతున్నారు’ అని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో నిర్మాతలు శ్రీధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News