Monday, August 11, 2025

స్పెషల్ ఎపిసోడ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ (Venkatesh) కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉందట. ఈ పాత్రలోనే హీరో వెంకటేష్ నటించబోతున్నాడట. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని, అందుకే.. అనిల్ రావిపూడి ఈ పాత్ర కోసం వెంకటేష్ ను ఎంపిక చేసుకున్నాడని టాక్ నడుస్తోంది.

కాగా.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఇదివరకే చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పిన సీన్స్ (Scenes narrated Anil Ravipudi) గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News