నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైస్’ (The Paradise). దసరా సినిమాతో తనకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. కొద్దిరోజుల క్రితం సినిమాలో నాని పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా (The Paradise) నుంచి ఓ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. స్పార్క్ ఆఫ్ ‘ది ప్యారడైజ్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణను మనం చూడవచ్చు. జైల్లో జరిగే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. ఈ వీడియోలో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. ‘వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో డ్రాగన్ సినిమా బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్రలో నటిస్తున్నారని టాక్. ఈ చిత్రానన్ని ఎనిమిది భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26ను విడుదల చేస్తున్నారు.