Tuesday, August 12, 2025

మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు

- Advertisement -
- Advertisement -

హనుమకొండ రాంనగకఃలోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇయ్యవద్దని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. ఆందోళకారులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నెలకు తగినంత వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధాకరం అని అన్నారు. ఓట్ల కోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా మంత్రి ఉన్న కొండా సురేఖ తోటి మహిళగా అర్ధం చేసుకుంటారని, తమ సమస్యను ఆమెకు విన్నవించుకుందామని ఇంటి వద్దకు వెళ్తే పోలీసులను పెట్టి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

జీతాలు లేకున్నా విద్యార్థులు ఇబ్బందులు పడద్దని స్వతహాగా అప్పులు తెచ్చి వండిపెట్టామని, తీరా తమకే జీవనాధారం లేకుండా పోయిందని వాపోయారు. విద్యార్థుల పొట్టలు ఎండకుండా చూస్తే తీరా పొట్టను కొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, సిఐటియు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News