Tuesday, August 12, 2025

అమెరికా అండతోనే అణు ప్రేలాపనలు!

- Advertisement -
- Advertisement -

అమెరికా గడ్డ నుంచి పాక్ అణ్వాయుధ దాడి బెదిరింపును
తీవ్రంగా ఖండించిన భారత్ అణు బ్లాక్ మెయిల్‌కు
లొంగబోమని స్పష్టీకరణ పాక్ సైన్యాధ్యక్షుడిని
తీవ్రంగా హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రిత్వశాఖ
నోరు అదుపులో పెట్టుకోవాలని అల్టిమేటం

న్యూఢిల్లీ :పాకిస్తాన్‌ను భారతదేశం తీవ్రస్వరంతో సోమవారంహెచ్చరించింది. ఆ సైన్యాధ్యక్షుడు అమెరికా గడ్డ నుంచి చేసిన అణ్వాయుధ బెదిరింపును తీవ్రంగా ఖండించింది. అ మెరికా పర్యటన సందర్భంగా పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన ప్రకటన తమ దృష్టికి వచ్చిందని. దీ నిని ఖండిస్తున్నామని, మునీర్ నో రు అదుపులో పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరించింది. అణ్వాయుధాలను ప్రయోగించడం పాకిస్తాన్ ప్రధాన లక్ష్యం అంటూ అమెరికా గ డ్డ నుంచి ప్రకటిండాన్ని తీవ్రంగా ప రిగణిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పే ర్కొంది. పాకిస్తాన్‌కు అణ్వాయుధ బ్లాక్‌మెయిలింగ్ అలవాటుగా మా రిందని, భారతదేశం అలాంటి బ్లాక్‌మెయిల్‌కు లొంగదని హెచ్చరించిం ది. అమెరికా పర్యటనలో భాగంగా అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్, భారతదేశం నుంచి అస్థిత్వ ముప్పు ఎదుర్కొన్న పక్షంలో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని మునీర్ ప్రకటించారు.

అటువంటి వ్యాఖ్యలు సైన్యాధ్యక్షుడి బాధ్యతా రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోందని, అంతర్జాతీయ సమాజం ఇలాంటి ప్రకటనలపై స్వంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. టెర్రరిస్ట్‌లతో పాక్ సైన్యం చేతులు కలిపినందున దేశంలోని అణుకమాండ్ దానికున్న నియంత్రణ పై సందేహాలను కలుగుతున్నాయని భారత విదేశాంగమంత్రిత్వశాఖ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు మిత్రదేశమైన మూడో దేశం నుంచి వెలువడడం దురదృష్టకరం అని పేర్కొంటూ భారతదేశం ఎప్పటికీ అణు బ్లాక్ మెయిల్ కు లొంగదని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. మా జాతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటామని భారత ప్రభుత్వం ధృవీకరించింది. పాక్ వ్యాఖ్యలను చాలా బాధ్యతా రహితమైన ప్రకటనగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ప్రాంతీయ, ప్రపంచ భద్రతను ఎలా పణంగా పెడుతోందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ అని పేర్కొన్నది. అమెరికా పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇచ్చినప్పుడల్లా, వారు తన అసలు దుష్ట స్వభావాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కానీ, బలమైన ప్రభుత్వం కానీ లేదని, సైన్యమే దేశాన్ని నియంత్రిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ లో ప్రభుత్వేతర సంస్థల చేతిలోకి అణ్వాయుధాలు వెళ్లే ప్రమాదం ఉంది ఈ వర్గాలు భయాన్ని వ్యక్తం చేశాయి.

అసిమ్ మునీర్ ఏం మాట్లాడాడంటే..
అమెరికాలో ఆదివారం ఓ ప్రైవేటు విందులో పాల్గొన్న అసిమ్ మునీర్ భారతదేశం నుంచి అస్థిత్వ ముప్పు ఎదురైతే, ఇస్లామాబాద్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. మనం ఓ అణ్వస్త్ర దేశం. మనం పతనమవుతున్నామని నమ్మితే, మనతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అని ఆయన అన్నారు. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించే వరకూ మేము వేచి ఉంటాం. అది నిర్మిస్తే, దానిని మేము పది క్షిపణులతో నాశనం చేస్తాం అని కూడా అన్నట్లు రిపోర్ట్ లు వచ్చాయి. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. .. అలాగే మాకు క్షిపణులకు కొరతలేదు అని అత్యంత బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది మే నెలలో భారతదేశంతో ఘర్షణ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ రెండు నెలల్లో అమెరికాలో జరుపుతున్న రెండో పర్యటన ఇది. ఆయన సీనియర్ రాజకీయ , సైనిక నాయకత్వంతో పాటు పాక్ ప్రవాసులతో ఉన్నతస్థాయి సంభాషణల్లో పాల్గొన్నట్లు పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News