Tuesday, August 12, 2025

స్థానిక సమరానికి ముందే పదవుల పందేరం

- Advertisement -
- Advertisement -

ఎన్నికలకు ముందు పదవులు ఇస్తే ఉత్సాహంగా
పని చేస్తారు జిల్లాల వారీగా ఆశావహుల
జాబితా పదవుల పంపిణీలో బిసిలు, మహిళలకు
పెద్దపీట ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన
వారికీ పదవులు 16,17 తేదీల్లో పిసిసి
కార్యవర్గం, పిఎసి సంయుక్త భేటీ బిసి
రిజర్వేషన్ల పెంపుపై భవిష్యత్ కార్యాచరణ
ఖరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏకగ్రీవంగా
అభ్యర్థి ఎంపిక సిఎం రేవంత్, పిసిసి చీఫ్
మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీలో కీలక నిర్ణయాలు
మలి విడత జనహిత పాదయాత్రలో
పాల్గొనాలని సిఎంకు పిసిసి సారథి ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ క మిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. సోమవారం మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వె ళ్ళారు. ఈ సందర్భంగా వారిరువురూ సుమా రు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించా రు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో వారు ప్రధానంగా చర్చించారని తెలిసింది. ఎన్నికలకు ముందు పదవుల భర్తీ చేసినట్లయితే పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని వారు భావించారు. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రులు, పా ర్లమెంటు ఇన్‌ఛార్జిల నివేదికలతో పాటు ఆశావాహుల జాబితాలను పరిశీలించి అర్హులైన వా రికి పదవులు ఇచ్చేందుకు జాబితాలు రూపొందించాలని నిర్ణయిచారు.

నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసే విషయంలో సమతుల్యత పాటించాలని వారు భావించారు. ఇందులో బిసిలకు, మహిళలకు అధికంగా ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. నియమాకాల విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తకుండా జిల్లాల ముఖ్యులతో చర్చించాలని వారు భావించినట్లు సమాచారం. మొదటి విడత ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, ఇతర డైరెక్టర్లు ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకుండా పని చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. మలి విడత పదవుల భర్తీలోనూ పార్టీనే నమ్ముకుని అకుంఠిత దీక్షతో పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న నాయకులకు పదవులను ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారి చర్చల సందర్భంగా ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. వివిధ కారణాలతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో సీనియర్లకూ కొన్ని పదవులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని వారు భావించారని తెలిసింది.

పిఎసిలో బిసి రిజర్వేషన్లపై చర్చిద్దాం..
ఇదిలాఉండగా ఈ నెల 16 లేదా 17న పిసిసి కార్యవర్గం, పార్టీ రాజకీయ వ్యవహారాల (పిఏసి) కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బిసి రిజర్వేషన్ల కోసం తాము చేసిన ప్రయత్నాలన్నింటినీ వివరిస్తూ, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై పిఏసి సభ్యులతో చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయంపైనా ఈ సమావేశంలో చర్చించాలని వారు నిర్ణయించారు.

జనహితతో ప్రజలకు చేరువ
గత నెల 31న చేపట్టిన మొదటి విడత జనహిత పాదయాత్ర చాలా విజయవంతమైందని, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఓపిగ్గా పాదాయత్రలో పాల్గొన్నారని మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంకా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ కమిటీలు, ఇతర ముఖ్య నాయకులూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారని ఆయన వివరించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇతర సమస్యల గురించి వెంటనే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఈ నెల 23 నుంచి మలి విడత పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నామని, ఇందులో మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది కాబట్టి వీలు చూసుకుని పాల్గొనాలని ఆయన ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..
ఇదిలాఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలోనూ వారు చర్చించారని తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నందున, ఏకాభిప్రాయం ద్వారానే అభ్యర్థి ఎంపిక జరగాలని రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించినట్లు సమాచారం.

అగ్రనేతల అరెస్టు అప్రజాస్వామికం : మహేశ్‌కుమార్
ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పూర్తి ఆధారాలతో దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడితే రాహుల్‌తో సహా ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ఏఐసిసి నాయకురాలు ప్రియాంక గాంధీని, ఇండియా కూటమి ఎంపిలను పోలీసులు అరెస్టు చేయడం అక్రమం, అప్రజాస్వామికం అని పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలు అందజేయాలని బయలుదేరిన తమ పార్టీ నాయకులను, ఎంపీలను అరెస్టు చేశారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల గల్లంతు, ఓట్ల చోరీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సిఇసిని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News