ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి
ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్
శాంతియుత పరిష్కారం
సాధించాలని సూచన తాజా
పరిస్థితులపై ఇరువురు నేతల చర్చ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారం సాధించే దిశగా భారత దేశం స్థిర మైన వైఖరిని పాటిస్తుందని ప్రధాని మోడీ ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్పష్టం చేశారు. ఉక్రె యిన్‌లో తాజా పరిణామాలపై ప్రధాని నరేం ద్రమోడీ, జెలెన్స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ తమ దేశ పరిస్థితులు,ఇటీవల జరిగిన పరిణామాలపై మో డీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పుతిన్, ట్రంప్ త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ చ ర్చించడం గమనార్హం. ఉక్రెయిన్ సంఘర్షణ ని వారించడానికి వీలైనంత త్వరలో శాంతియు త పరిష్కారం సాధించే దిశలో భారత్ స్థిరమైన వైఖ రిని అనుసరిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో మోడీ తెలియజేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోసహా అన్ని ముఖ్యమైన అంశాలను మోడీతో చర్చించినట్టు జెలె న్‌స్కీ తెలియజేశారు. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షల గురించి మాట్లాడుతూఏ రష్యా నుంచి చమురు ఎగుమతులను పరిమితం చేయడం తప్పనిసరి అని సూచించారు.