Tuesday, August 12, 2025

స్పెషల్ బస్ ల పేరుతో అధిక చార్జీల వసూలు సరికాదు

- Advertisement -
- Advertisement -

మోత్కూరు: తొర్రూరు యాదగిరిగుట్ట సూర్యాపేట డిపోల వారు రాఖీ పండుగ స్పెషల్ సర్వీస్ పేరుతో ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చెయ్యడం సరికాదని, అధిక చార్జీల వసూలు మానుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ మోత్కూరు మండల అధ్యక్షుడు చెడే ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మోత్కూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా మోత్కూరు నుండి భువనగిరి వరకుపల్లెవెలుగు లో 50 ఎక్స్ప్రెస్ లో 70 ఉండగా 100 చొప్పున మోత్కూరు నుండి ఉప్పల్ కి పల్లెవెలుగు లో 110 ఎక్స్ప్రెస్ లో 140 ఉండగా 200 చొప్పున వసూలు చెయ్యడం దారుణమన్నారు. స్పెషల్ సర్వీస్ పేరుతో ప్రయాణికుల వద్ద మహాలక్ష్మి పథకాన్ని అమలు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News