Tuesday, August 12, 2025

వెస్టిండీస్ జయకేతనం

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ డక్‌వర్త్ లూ యిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సైమ్ అయుబ్ (23), అబ్దుల్లా షఫిక్ (26) పరుగులు సాధించారు. సీనియర్ ఆటగాడు బాబర్ ఆజమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తలత్ (31), హసన్ నవాజ్ 36 (నాటౌట్) కాస్త మెరుగ్గా బ్యాటిం గ్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 33.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ షాయ్ హోప్ (32), షెర్ఫానె రూథర్‌ఫోర్ట్ (45), రోస్టన్ ఛేజ్ 49(నాటౌట్), జస్టిన్ గ్రీవ్స్ 26(నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. చెలరేగి ఆడిన రూథర్‌ఫోర్ట్ 3 సిక్సర్లు, 4ఫోర్లతో వేగంగా 45 పరుగులు సాధించాడు. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News