- Advertisement -
హైదరాబాద్: మరోసారి మంత్రి పదవిపై మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎంఎల్‌ఎలు ఉంటే మూడు మంత్రి పదవులు ఇచ్చారని, నల్లగొండలో 11 మంది ఎంఎల్‌ఎలు ఉంటే మూడు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పితే ఎలా అని కోమటిరెడ్డి అడిగారు. ఇద్దరం అన్నదమ్ములం అని పార్టీలో చేర్చుకున్నప్పుడు తెలియదా? అని నిలదీశారు. అన్నదమ్ములం ఇద్దరం సమర్థులమేనని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అడిగారు. ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -