మనతెలంగాణ/పరిగి: సుమారు నూట యాబై ఏళ్ల నాటి పురాతన భారీ మర్రిచెట్టు నేలమట్టమైంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కోడంగల్ చౌరస్తా సమీపంలో బాలు టిఫీన్ సెంటర్ వద్ద ఈ వృక్షం నెలకు కూకటీ వేళ్లతో పెకులించి కింద పడింది. గత రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు ఈ మర్రి చెట్టు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వేర్లతో పూర్తిగా పడిపోయిన మర్రి వృక్షాని పరిశీలించారు. ప్రతి రోజు ఈ చెట్టు కింద బాలు అనే వ్యక్తి టిఫీన్ సెంటర్ నడిపేవాడు. అయితే ఈ రోజు ఉదయం భారీగా వర్షం పడటంతో టిఫీన్ సెంటర్ బంద్ చేశాడు. దీంతో ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగలేదు.
షాద్‌నగర్ నుంచి పరిగికి వచ్చే రహాదారిలో ఈ చెట్టు పడిపోవడంతో ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదాలు జరగలేవు. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అటు ఆటూ రెండు స్థంబాలు విరిగి నెలకు వంగిపోయాయి. వెంటనే మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో చెట్టును కొంత సమయం తీసుకుని రంపలతో కట్ చేసి చెట్టును రోడ్డుపై నుంచి తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు దగ్గరుండి వెంటనే స్థంబాలను వైర్లను సరి చేశారు. కొంత రాకపోకలకు అంతరాయం ఎర్పడ్డ తర్వాత ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.