మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: స్థానిక ఎన్నికల్లో 20వ వార్డులో గెలిచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుకు బహుమతిగా ఇస్తామని 20వ వార్డు అధ్యక్షులు చాంద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు. మహిళలకు ఇస్తానన్న 2500 పెన్షన్, ఆసారా పెన్షన్ 2000 నుండి 4000 వరకు పెంచలేదని , రైతు బీమా పేరే లేదన్నారు. రైతుబంధును 15 వేలు చేస్తామన్న మాట కూడా తప్పరన్నారు. 500 కు వంటగ్యాస్ , విద్యార్థులకు స్కూటీ లను మంజూరు చేయలేదన్నారు. ఇచ్చిన గ్యారెంటీ ల గురించి 20 వార్డు కౌన్సిలర్ జవాబు ఇవ్వాలని వార్డు మీద అంత ప్రేమ ఉంటే ప్రభుత్వంతో కొట్లాడి వార్డు అభివృద్దికి కృషి చేయాలన్నారు.
మైనార్టీలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో హాజ్ హౌస్, తడకపల్లి శివారులో మూడు ఎకరాల స్థలం హరీష్ రావు తన సొంత డబ్బులతో ఇప్పించారని ఇప్పటికి మార్కెట్ లో ఆ స్థలం 3 కోట్ల విలువఉంటుందన్నారు. ప్రభుత్వం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. హరీష్ రావు తన సొంత ఖర్చులతో యేట పదిమందిని ఉమ్రా హజ్ కు పంపుతున్నారని కాంగ్రెస్ కానీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎస్సీలకు దళిత బంధు అలాగే యువతకు పెన్షన్ రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగుల నుండి 16,00,000 అప్లికేషన్లు తీసుకుని చెత్త కుప్పలో వేశారన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 43 వార్డులు గులాబీ జెండా ఎగుడుతుందని అలాగే 20వ వార్డులో భారీ మెజార్టీతో గెలిచి హరీష్ రావు గిఫ్ట్ ఇస్తామన్నారు.