Wednesday, August 13, 2025

72 గంటలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు
విద్యుత్, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ
సహా అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలి ప్రాణ, ఆస్తి నష్టం
సంభవించకుండా జాగ్రత్త పడాలి
ఐటి, విద్యాశాఖ అధికారులు పరిస్థితికి
తగినట్లు నిర్ణయం తీసుకోవాలి భారీ
వర్ష సూచన ఉన్న జిల్లాలకు ప్రత్యేక
అధికారుల నియామకం భారీ
వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాబో యే 72గంటలు అందరూ అప్రమత్తం గా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను, జిల్లాకలెక్టర్‌లను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూం కు చేరేలా చూడాలని ఆయన సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ న ష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించడానికి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని, అవసరమైన నిధులు అందించడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అధికారులతో మంగళవారం

రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీ డియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్ర జలను అప్రమ త్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, సి బ్బంది సెలవులను రద్దు చేసి వారు 24గంటలు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోటుకు ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలర్ట్ చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్‌లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోలలో ప్రజలను అలర్ట్ చేయాలని సిఎం సూచించారు.

ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్
మన వ్యవస్థలో 24 గంటల్లో 2 సెంటిమీటర్ల వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో పట్టణాల నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం క్లౌడ్ బరస్ట్ సమయాల్లోనూ పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని అధికారులను ఆయన సూచించారు. స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సంబంధించి అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని, భారీ వర్షాల సమయంలో వారు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలని, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దని, సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి
అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహారించాలని, అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఎం ఆదేశించారు.

జల విద్యుత్ తయారీపై అధికారులు దృష్టి సారించాలి
రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది, ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయని, కానీ, వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని ప్రస్తుతం ఇలాంటి విషయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. ఊహించనంత వర్షపాతంతో గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అటువంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావడానికి వీల్లేదని సిఎం ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్‌ఫ్లో ఔట్ ఫ్లోపై పూర్తి అవగాహనతో ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. జల విద్యుత్ తయారీపై అధికారులు దృష్టి సారించాలని, అదే సమయంలో నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సిఎం ఆదేశించారు.

ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి బాధితులకు పరిహారం అందేలా….
చెరువులు, కుంటలు కట్టల తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది 24X7 అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లను అందుబాటులో పెట్టుకోవాలని సిఎం ఆదేశించారు. పిడుగుపాట్లతో పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి బాధితులకు పరిహారం అందేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. హైడ్రా, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని సిఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణారావు, డిజిపి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News