మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని పిస్తా హౌస్ రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. మొత్తం 25 ప్రాంతాల్లోని పిస్తా హౌ స్ రెస్టారెంట్లలో జీహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అ ధికారులు తనిఖీలు చేసి 23 శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించా రు. పిస్తా హౌస్ హోటళ్ళు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాల అపరిశుభ్రంగా ఉ న్నట్లు గుర్తించారు. కి చెన్‌లో ఎలుకలు, బొ ద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు , వాష్ ఏరియా అపరిశుభ్రతతో, రా క్స్‌ల్లో ఫుడ్ ఆ ర్టికల్స్‌ను స్టోరేజ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించి హెచ్చరికలు జారీచేసినట్టు తెలిపా రు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్న నిర్వాహకులపై, తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఎలుకలు, బొద్దింకలు, ఈగలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -