హైదరాబాద్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13, 14వ తేదీల్లో హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటి పూట బడులు ఉంటాయని వెల్లడించింది.
లోతట్టు ప్రాంతాల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను, జిల్లాకలెక్టర్, ఇంచార్జీ మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీ డియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ న ష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోలతో పాటు మీడియాల, సోషల్ మీడియా ద్వారా ప్రజలను అలర్ట్ చేయాలని సిఎం సూచించారు. అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.