Thursday, August 14, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైందని బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బాలానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన హరికృష్ణ(21) డిగ్రీ చదివి జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పాటు చాటింగ్ చేస్తుండేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్ చదువుతున్న బాలిక పరిచయం కావడంతో ప్రతి రోజు చాటింగ్ చేసుకునేవారు. జూన్‌లో ఐడిపిఎల్‌లోని టౌన్‌షిప్‌కు రమ్మని బాలికకు సదరు యువకుడు సమాచారం ఇచ్చాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. మరో రెండు సార్లు బాలికపై అత్యాచారం చేశారు. బాలిక వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెల్లారు. బాలిక గర్భిణీ తేలడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. జరిగిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News