లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ సిరీస్ చిరకాలం తీపి జ్ఞాపికంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లు కూడా చివరి క్షణం వరకు నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. అన్ని మ్యాచుల్లో కూడా రెండు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. కొంత కాలంగా టెస్టు మ్యాచ్‌లు అంటే మూడు రోజుల్లోనే ముగియడం పారిపాటిగా మారింది. కానీ జేమ్స్ అండర్సన్, సచిన్ టెండూల్కర్ ట్రోఫీ పేరిట నిర్వహించిన ఈ సిరీస్ మాత్రం చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగింది. అన్ని మ్యాచ్‌లు కూడా ఐదు రోజుల పాటు కొనసాగాయి.
చాలా రోజుల తర్వాత ఇలా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇలాంటి ఫలితం కనిపించింది. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరిగిన సమరం అభిమానులను ఇట్టే కట్టిపడేసింది. ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు అసాధారణ ఆటతో ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచుల్లో కూడా చిరి వరకు సర్వం ఒడ్డారు. దీంతో సిరీస్ టెస్టు క్రికెట్‌కు కొత్త దిశను చూపించిందని చెప్పాలి. కొన్ని రోజులుగా కళతప్పిన టెస్టు క్రికెట్ ఫార్మాట్‌కు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సిరీస్ కొత్త ఊపునిచ్చింది. రానున్న రోజుల్లో జరిగే కీలక సిరీస్‌లు మరింత ఉత్కంఠభరితంగా సాగేందుకు ఇది దోహదం చేసుతందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డిజిటల్ వీక్షణలో నయా చరిత్ర..
సుదీర్ఘ రోజుల పాటు కొనసాగిన భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ వీక్షణలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే సచిన్, అండర్సన్ ట్రోఫీ సరికొత్త ఆధ్యాయానికి తెరలేపింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ చివరి రోజు ఆటను రికార్డు స్థాయిలో 13 మిలియమ్ మంది వీక్షించారు. జియో హాట్‌స్టార్ ద్వారా అభిమానులు ఈ మ్యాచ్‌ను తిలకించారు. డిజిటల్ వీక్షణలో ఇది ఆల్‌టైమ్ రికార్డు కావడం విశేషం. గతంలో ఎప్పుడూ కూడా ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ దక్కలేదు.
కానీ, ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో అభిమానులు జియో హాట్‌స్టార్‌లో వీక్షించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ హవా కొనసాగుతున్న ప్రస్తుతం తరుణంలో సంప్రదాయా టెస్టు క్రికెట్‌ను ఇంత అభిమానులు డిజిటల్ నెట్‌వర్క్‌లో వీక్షించడం సామాన్య విషయం కాదు. టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపునిస్తుందనే చెప్పాలి. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వివిధ వేర్వేరు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. ఇక హాట్‌స్టార్ ద్వారా రికారడు స్థాయిలో 170 మిలియన్‌లకు పైగా అభిమానులు మ్యాచ్‌లను తిలకించడం విశేషం. డిజిటల్ ప్లాట్‌ఫాం చరిత్రలో ఏ టెస్టు సిరీస్‌కు కూడా ఇంత ఆదరణ లభించలేదు. కానీ, అండర్సన్‌సచిన్ టెండూల్కర్ ట్రోఫీ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఔరా అనిపించింది.