Wednesday, August 13, 2025

భువనగిరిలో వైద్యుల నిర్లక్ష్యం… శిశువు ప్రాణం ఖరీదు రూ.1 లక్ష

- Advertisement -
- Advertisement -

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. రూ. 1 లక్ష సెటిల్మెంట్

భువనగిరి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో శిశువు పురిటిలోనే మృతి చెందిందంటూ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికీ చెందిన తేజస్విని చేకాఫ్ కోసం భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ మెటర్నిటీ ఆసుపత్రికి వచ్చింది. మంగళవారం తేజస్విని ఆసుపత్రికి రావడంతో వైద్యులు లేకపోవడంతో నర్సులే వైద్యులుగా మారి వాట్సాప్ ద్వారా వైద్యుల సలహాలు తీసుకుంటూ ఇంజెక్షన్ నిర్వహించగా ఇంజెక్షన్ వికటించి నవజాత శిశువు మృతిచెందింది.

కాగ శిశువు మృతి చెంది తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఏడు నెలల గర్భిణి స్త్రి ఇబ్బందులు పడుతుందని తెలిసి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు పట్టించుకోకుండా ఇంజెక్షన్ చేశారని.. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆందోళన తీవ్రతరం కావడంతో స్థానిక భువనగిరి పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులకు నచ్చజెప్పినా విరమించకపోవడంతో ఓ ల్యాబ్ నిర్వాహకుడు ఆసుపత్రి యాజమాన్యం, భాదిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయం స్థానికంగా తెలిసింది. కొంత మంది వైద్య అధికారులు కీలకంగా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవజాత శిశువు మృతికి రూ. ఒక్క లక్ష పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి నిర్వాహకులతో ఒప్పందం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. నాయకులకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందనేది సమాచారం.

ఈ విషయమై భువనగిరి పట్టణ పోలీసు ఉన్నతాధికారులను ‘మనతెలంగాణ’ సంప్రదించగా తమకు ఫిర్యాదు వచ్చిన కొద్ది సేపటి తరువాత పిర్యాదు వాపసు తీసుకున్నారని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శిశువు మృతికి కారణం.. సెటిల్మెంట్ విషయమై నిఘా సమాచారాన్ని సేకరిస్తున్నామని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. కాగ ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఆసుపత్రిలో తరుచు జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు తొలి ఊపుతూ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News