- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వానలు కురుస్తుండటంతో గత రెండు రోజులు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. మళ్లీ బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులకు 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, మంగళవారం 82,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… వీరిలో 30,505 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం విలువ రూ.3.73 కోట్లుగా టిటిడి తెలిపింది.
- Advertisement -